ఆదోని, 2026-11-28
కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ బీటీ నాయుడు సొంత గ్రామమైన కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా యేసు, ఎంపీటీసీ అభ్యర్థిగా డానియల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శనివారం గ్రామ పెద్దలు, ప్రముఖులు ఎమ్మెల్సీ బీటీ నాయుడును కలిసి ఘనంగా సన్మానించారు. తమ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏకగ్రీవ ఎన్నికలతో గ్రామంలో ఐక్యత, సమష్టి నిర్ణయానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరి, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.







