తిమ్మజిపేట, 2026-11-24
ఎస్సీ వార్డుల అభివృద్ధికి వైస్ చైర్మన్ పదవిని మాదిగలకు కేటాయించినందుకు ఆదోని టిడిపి ఇన్చార్జ్ కొంక మీనాక్షి నాయుడు గారికి ఆదోని ఎమ్మార్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వార్డుల అభివృద్ధికి వైస్ చైర్మన్ పదవిని మాదిగలకు కేటాయించినందుకు ఆదోని టిడిపి ఇన్చార్జ్ కొంక మీనాక్షి నాయుడు గారికి ఆదోని ఎమ్మార్పీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆదోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం ఎంఎస్పీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నాగరాజు బండారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంత మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గ కూటమి నేతలు, టిడిపి ఇన్చార్జి కొంకా మీనాక్షి నాయుడు గారికి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారికి, టిడిపి యువ నాయకులు భూపాల్ చౌదరి గారికి, నూతనంగా ఎన్నికైన స్వప్నమ్మ మల్లప్ప నాయకర్ గారికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సామాజిక ఉద్యమ నాయకులు అభివందనాలు తెలిపారు. మా డిమాండ్‌ను అంగీకరించి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సన్నక్కి జయరాం మాదిగ గారికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించి, మాదిగల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు మరోసారి ఉద్యమ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.
మీరు చూపిన గౌరవానికి మా జాతి సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగా, మహాకూటమి అధినేతలు, భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ను సాధించి ఇచ్చిన ఘనత మహాకూటమికే దక్కిందని గుర్తు చేశారు. మీరు చేసిన మేలును ఎన్నటికీ మరువలేనిదిగా చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించిన ఆదోని నియోజకవర్గం ఎంఎస్పీ అధికార ప్రతినిధి నాగరాజు బండారి మాదిగ, ముఖ్య అతిథులు బండారి హనుమంతు మాదిగ (ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి), బండారి గిడ్డయ్య మాదిగ (ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు), వన్నెల మణికంఠ మాదిగ (ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు), గుండ్రేవుల దత్తు మాదిగ (ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు), కాటిపోగుల ఈశ్వర్ మాదిగ (ఎంఎస్పీ పట్టణ అధ్యక్షులు), ఎం కిరణ్ కుమార్ మాదిగ (ఎంఎస్పీ ప్రధాన కార్యదర్శి), రాజు మాదిగ (ఎమ్మార్పీఎస్ పట్టణ అధికార ప్రతినిధి), బలరాం మాదిగ (ఎమ్మార్పీఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి), లోక దళ్ గణేష్ మాదిగ (ఎంఎస్పీ పట్టణ అధికార ప్రతినిధి), మడ్రి శాంత రాజ్ మాదిగ, శివ మాదిగ (ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు), నకుల మాదిగ, హరి మాదిగ, తిమ్మన్న మాదిగ (ఎమ్మార్పీఎస్ నాయకులు) పాల్గొన్నారు.


