చిలకలూరిపేట, 2026-11-26
గణపవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ, కూటమి అభ్యర్థి మండలనేని లక్ష్మికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా మద్దతుదారులు స్వచ్ఛందంగా తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.
గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ, కూటమి అభ్యర్థి మండలనేని లక్ష్మి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమానికి 300 మందికి పైగా మద్దతుదారులు స్వచ్ఛందంగా తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.
భారీ ర్యాలీగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన లక్ష్మి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి మద్దతు కోరారు. అనేకచోట్ల గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రచారంలో పాల్గొనడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వలెటి హేమంత్, జనసేన పార్టీ యాడ్ డైరెక్టర్ ఆముదాల కిషోర్, జనసేన పార్టీ నాయకుడు సుభాని, మండలనేని శ్రీనివాసరావు, మండలనేని వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


