హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) జాతీయ, ప్రాంతీయ కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు నమస్కారం. సంస్థ సర్వతోముఖాభివృద్ధిని, ఆశయాలను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో, అంతర్గత క్రమశిక్షణ, పారదర్శకతను కాపాడటానికి ఐదుగురు సభ్యులతో కూడిన 'క్రమశిక్షణా కమిటీ'ని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: HRCI అధికారిక క్రమశిక్షణా కమిటీలో అమితినేని అమర్ బాబు (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్) ప్రెసిడెంట్గా, బేతి తిరుమలరావు (నేషనల్ వైస్ ప్రెసిడెంట్) వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా లకాకుల ముత్యాల బాబు (నేషనల్ జనరల్ సెక్రెటరీ), M. సత్యనారాయణ ప్రసాద్ (సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్), అట్లూరి బాలశేఖర్ (సౌత్ ఇండియా కమిటీ అబ్జర్వర్) నియమితులయ్యారు.
ఒక సంస్థ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలంటే క్రమశిక్షణ ప్రధాన మూలస్తంభమని, HRCI సాధించే విజయాలు, చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు నిబద్ధతపై ఆధారపడి ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. సంస్థ అభివృద్ధి దిశగా సాగే ప్రయాణంలో తప్పు-ఒప్పులను నిష్పాక్షికంగా సమీక్షించి, సంస్థ హితం కోరి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది.
సభ్యుల ప్రవర్తన, సంస్థ నియమావళి పట్ల వారి అనుసరణపై ఈ కమిటీ తీసుకునే నిర్ణయమే అత్యంత ప్రామాణికమైనది, తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. నాయకత్వ బాధ్యతలలో ఉన్నవారైనా, EC మెంబర్ అయినా సంస్థ ప్రతిష్టను కాపాడటంలో, క్రమశిక్షణ పాటించడంలో ఈ కమిటీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కోరారు. అందరం కలిసికట్టుగా, క్రమశిక్షణతో HRCIని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.











