న్యూఢిల్లీ, 01-07-2026
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తన జిల్లా, రాష్ట్ర, జోనల్ ఇన్ఛార్జ్ల కోసం 01-07-2026 బుధవారం సాయంత్రం 07:30 గంటలకు ఆన్లైన్ వాట్స్అప్ రివ్యూ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశం HRCI జాతీయ అధ్యక్షులు, వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అమితినేని అమర్ బాబు (జనక్స్ అమర్) ఆధ్వర్యంలో జరగనుంది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తన జాతీయ కార్యాలయం ద్వారా జిల్లా, రాష్ట్ర, జోనల్ ఇన్ఛార్జ్ల కోసం పాక్షిక సమీక్షా సమావేశాన్ని (Fortnightly Review Meeting) నిర్వహించనుంది. HRCI నియమావళి ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే ఈ సమావేశం ఆన్లైన్ వాట్స్అప్ రివ్యూ మీటింగ్ వేదికగా జరగనుంది.
ఈ సమావేశం 01-07-2026 బుధవారం సాయంత్రం 07:30 గంటలకు (7:30 PM) జరగనుంది. HRCI జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ అమితినేని అమర్ బాబు (జనక్స్ అమర్) గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబడుతుంది. నేషనల్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ ముత్యాల బాబు గారి అమూల్యమైన సూచనలు కూడా ఈ సందర్భంగా తీసుకోబడతాయి.
ఈ సమీక్షా సమావేశానికి వివిధ విభాగాలకు చెందిన జిల్లా, రాష్ట్ర, జోనల్ ఇన్ఛార్జ్లు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్య గమనికగా సూచించారు. సంస్థ బలోపేతానికి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, సకాలంలో సమావేశానికి హాజరు కావాలని కోరడమైనది.









