అనంతపురం, 2026-11-20
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రత్యేక సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రత్యేక సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, సహచర ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగరాజుకు, వైస్ చైర్మన్గా ఎన్నికైన వెన్నపూస లలితకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాసేవే లక్ష్యంగా జిల్లా పరిషత్ అభివృద్ధికి నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జడ్పీటీసీ) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


