బాపట్ల, 12 జూలై 2026
చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు పలు సచివాలయాలను సందర్శించి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.
చీరాల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓటర్ల ధృవీకరణ (వెరిఫికేషన్) ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు పలు సచివాలయాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ పోలింగ్ కేంద్రాలు, సచివాలయాల్లో అధికారులు చేపడుతున్న ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










