శింగనమల (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 24
శింగనమల నియోజకవర్గంలోని కోరివిపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు 40 వైసీపీ కుటుంబాలు కూడా టీడీపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
శింగనమల నియోజకవర్గంలోని శింగనమల మండలం కోరివిపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ, సావిత్రి, సులోచన, పెద్దయ్య, నగేష్, లలితమ్మ, రాజశేఖర్, పెద్దక్క, సాలక్క, మహేష్ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.
గ్రామంలో మంచి ప్రజా పరిచయాలు, ప్రభావం కలిగిన నాయకులుగా ఉన్న వీరు, సుమారు 40 వైసీపీ కుటుంబాలను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పార్టీలో చేరిన వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతం, నాయకుల సమన్వయం, కూటమి విజయం అనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.



