కోట, 19 November
భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ వారు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలను గురువారం పంపిణీ చేశారు.

మాజీ మహిళా ప్రధాని మన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
వైద్య పరీక్షలు, అద్దాల పంపిణీ
ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరానికి రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ రమేష్ హాజరై, కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను తయారుచేసి గురువారం పంపిణీ చేశారు.
సేవా కార్యక్రమం అభినందనీయం
స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మృతి చెందిన నెలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నిరుపేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఒకపక్క నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి, మరోపక్క దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలు అందజేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు
నేత్ర సమస్యలతో బాధపడేవారిని, కంటిలో శుక్లాలు ఉన్నవారిని గుర్తించి, వారికి మెరుగైన ఆపరేషన్ నిమిత్తం నెల్లూరు వాసన్ ఐ కేర్ కు తరలిస్తున్నట్లు ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, వైద్యులు వి. రమేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.