చీరాల, 2026-11-26
కొత్తపాలెం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కావూరి నాగమల్లేశ్వరి తెలిపారు.
కొత్తపాలెం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కావూరి నాగమల్లేశ్వరి తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. గురువారం కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, బ్యాలెట్ నమూనాలో రెండో నంబర్లో ఉన్న కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు. గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని తెలిపారు. తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు.
సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ గ్రామాభివృద్ధికి సమిష్టిగా ముందుకు సాగుతానని నాగమల్లేశ్వరి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని కొత్తపాలెం గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడమే తన సంకల్పమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఓటర్లు తమ అమూల్యమైన ఓటును రెండో నంబర్ కత్తెర గుర్తుపై వేసి తనను ఆదరించి గెలిపించాలని కావూరి నాగమల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు.


