బాపట్ల, 2026-07-09
వజయవడచెదనమమదగఅనమనపదమృదళఘపటఫగపభవబవనమణ,ఎీ,ఎటీఅయచనధచటటదనమదచదనదళహపషణమషటఅధయషడనీనగదవెప.ఈమపదళఉదయమవజయమనఆయనఅనన.
విజయవాడకు చెందిన క్రాంతి కుమార్ మాదిగ అనుమానాస్పద మృతి కేసులో దళితుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం బలవన్మరణం (అబెట్మెంట్ టు సుయిసైడ్)తో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు పేర్కొన్నారు. గురువారం చీరాల అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
క్రాంతి కుమార్ మృతి కేసును తొలుత అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన పోలీసులు, దళిత సంఘాల ఆందోళనలు, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో బలవన్మరణం కేసుగా, అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లు జోడించి నమోదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మార్పు దళితుల ఉద్యమ విజయమని ఆయన అన్నారు.
క్రాంతి కుమార్ తనను కులం పేరుతో అవమానించారని, చిత్రహింసలకు గురిచేశారని, అక్రమ కార్యకలాపాలకు ఒత్తిడి తెచ్చారని, వాటికి సహకరించకపోవడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు నీలం నాగేంద్రరావు చెప్పారు. ఆ వేధింపులు భరించలేకే క్రాంతి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు సంబంధిత టాస్క్ఫోర్స్ పోలీసు సిబ్బందిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మరో కేసులో జైలులో ఉన్న సీఐ నాగరాజును క్రాంతి కుమార్ కేసులోనూ నిందితుడిగా అరెస్టు చేసి విచారించాలని కోరారు.
క్రాంతి కుమార్ కేసుపై ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయలేదని విమర్శించిన నీలం నాగేంద్రరావు, ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో నిష్పక్షపాత దర్యాప్తు జరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో కాకుమాను రవి, పట్రా బంగారం, మేడికొండ మురళి, బుజ్జిబాబు తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.








