తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అనుకూల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఈ వ్యవహారంపై సబర్ నివేదికను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సబర్ నివేదికను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ విషయాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 64, బీజేపీ, ఎంఐఎం చెరో ఏడు స్థానాలు సాధించాయి. అయితే, బీఆర్ఎస్ గెలిచిన 39 నియోజకవర్గాల్లోని ఓటర్లలో ఏకంగా 27.7 శాతం (30,26,510) మందిని సర్లో భాగంగా ఏఎస్డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికెట్) జాబితాలో చేర్చినట్లు సబర్ నివేదికను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
ఈ తొలగింపులు గులాబీ పార్టీకి నష్టం కలిగించేందుకే జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.












