వేటపాలెం, 2026-11-26
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామపంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల వరలక్ష్మి, వేటపాలెం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామపంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల వరలక్ష్మి, వేటపాలెం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికులతో మమేకమయ్యారు. అభ్యర్థుల తరఫున కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


