నెల్లూరు గ్రామీణం, 2026-11-28
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ప్రజాక్షేమమే పరమావధిగా పనిచేస్తూ, సమష్టి కార్యాచరణతో నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేద్దామని జనసేన నాయకులు కిషోర్ గునుకుల పిలుపునిచ్చారు.
కిషోర్ గునుకుల నివాసంలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లతో వరుసగా రెండో రోజు ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, డివిజన్ల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధానం తదితర అంశాలపై చర్చించారు.
ప్రతి డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమష్టిగా గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, ఒక డివిజన్లో విజయవంతమైన అభివృద్ధి కార్యక్రమాలను ఇతర డివిజన్లలోనూ అమలు చేస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే పార్టీ అధిష్ఠాన పెద్దలను కలిసి వారి ఆశీస్సులు, మార్గదర్శకత్వం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ప్రజాసేవకు దిశానిర్దేశం
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మనందరిపై ప్రజలకు ప్రత్యేకమైన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి సమస్యకు బాధ్యతాయుతంగా స్పందించాలి. వ్యక్తిగత ఆలోచనలకు అతీతంగా ఐక్యతతో పనిచేస్తూ ప్రజాక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ పెద్దల మార్గదర్శకత్వంలో సమిష్టి కార్యాచరణ రూపొందించుకుని జనసేన పార్టీకి మరింత గౌరవం తీసుకురావాలి అని పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ సమావేశం కేవలం విందుకే పరిమితం కాకుండా, ప్రజాసేవకు దిశానిర్దేశం చేసే ఆలోచనల వేదికగా నిలిచింది.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిట్టమూరి ప్రవీణ్ రెడ్డి, సుధా మాధవ్, గుర్రం కిషోర్, మనోజ్, శ్రీకాంత్, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, నరహరి, నాగేంద్ర, బాలు, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, వేముల శివకృష్ణ, హర్ష, ప్రవల్లిక, శ్రీలక్ష్మి, ప్రశాంతి, వల్లి తదితరులు పాల్గొన్నారు.


