గుంటూరు, 2026-11-23
నందిగామ మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ శాఖమూరి వంశీధర్ ను పూలమాలతో, శాలువాతో సత్కరించి అభినందించారు. నూతన చైర్మన్తో పాటు కౌన్సిలర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలు అప్పగించిన పదవులను హోదాలుగా కాకుండా బాధ్యతలుగా భావించి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
అలాగే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు చైర్మన్ మరియు కౌన్సిలర్లందరూ పూర్తి సహకారం అందిస్తూ, సమన్వయంతో పనిచేసి నందిగామను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, చైర్మన్ వంశీధర్ లు వెంకటేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీమ్ తాళ్ళ వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు.



