పెండ్లిమర్రి, 2026-11-26
పెండ్లిమర్రి మండలం నందిమండల గ్రామంలోని చౌడమ్మ తల్లి దేవస్థానం వద్ద అయ్యప్ప స్వామి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వామి భక్తబృందం, గ్రామ ప్రజలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ గ్రామ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయని, భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.


