*నరసరావుపేట (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 22
నరసరావుపేట మునిసిపల్ ఎన్నికల అధికారి ఎన్ ప్రభాకర్ పై విచారణ జరిపి నివేదిక అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
నరసరావుపేట మునిసిపల్ ఎన్నికల అధికారి ఎన్ ప్రభాకర్ పై విచారణ జరిపి నివేదిక అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఫిర్యాదు వివరాలు
నరసరావుపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ మరియు మునిసిపల్ ఎన్నికల అధికారి ఎన్ ప్రభాకర్ నామినేషన్ స్వీకరణ సందర్భంగా నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించిన తీరుపై నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ పి రామారావు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వులు పంపించారు. ఈ కాపీ ప్రతిని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, నరసరావుపేట మునిసిపల్ కమిషనర్ కు కూడా పంపించారు.


