Kadapa, 2026-11-25
పెళ్లిమరి మండలం, నంది మండలానికి చెందిన రైతు మేరెడ్డి రాములమ్మ తమ పొలంలో మీడియా సమావేశం నిర్వహించి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పొలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.
పెళ్లిమరి మండలం, నంది మండలానికి చెందిన మేరెడ్డి రాములమ్మ తమ పొలంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పొలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, నంది మండలం సబ్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆమె తెలిపారు. మిగతా రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి తమ పొలానికి ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తమ పొలానికి విద్యుత్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని అడగగా, పెళ్లిమరి ఏఈ మీరు మీ పొలంలో ట్రాక్టర్ తో విద్యుత్ స్తంభాలను పడగొట్టారు, అందుకే కనెక్షన్ ఇవ్వము అని తెలిపారని రాములమ్మ చెప్పారు. తమ పొలంలో తామే విద్యుత్ స్తంభాలను పడగొట్టుకుంటామని ఆమె ప్రశ్నించారు. విద్యుత్ స్తంభాలు అన్ని కిందికి వాలి ఉన్నాయని, అనేకసార్లు నందిమండలం సబ్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆమె తెలిపారు.



