Yerragondapalem, జూలై 31
ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక పేద కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. సంఘంతండా గ్రామంలో జరిగిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఈ సాయం అందింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఒక పేద కుటుంబానికి రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేయించారు. ఇటీవల త్రిపురాంతకం మండలం సంఘంతండా గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా, గ్రామానికి చెందిన రామావత్ బాలిభాయ్ (భర్త: మంగ్యనాయక్) కుటుంబం ఆర్థిక ఇబ్బందులను వివరించి బియ్యం సాయం కోరింది.
దీనిపై స్పందించిన ఎరిక్షన్ బాబు రెండు క్వింటాళ్ల బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శుక్రవారం ఆయన సూచనలతో సంబంధిత కుటుంబానికి రెండు క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









