వేటపాలెం, 2026-11-27
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని రామానగర్‌లో సర్పంచ్ అభ్యర్థి మార్పు నళిని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, మద్దులూరి మహేంద్రనాథ్ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ప్రచారం ప్రారంభించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని రామానగర్‌లో సర్పంచ్ అభ్యర్థి మార్పు నళిని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, మద్దులూరి మహేంద్రనాథ్ బలపరిచిన అభ్యర్థిగా ఆమె చౌడేశ్వరి ఆలయం వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి గ్రామ ప్రజలను, మహిళలను, పెద్దలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, దేశాయిపేట గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మార్పు నళిని హామీ ఇచ్చారు. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో దేశాయిపేట గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాచర్ల సాంబశివరావు, లేళ్ళ శ్రీధర్, కర్ణ ప్రసాద్, మండల మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ బాషా, 18వ వార్డు సభ్యుడు బుద్ధి హేమసుందర్, 19వ వార్డు సభ్యుడు మొగల్ జిలాని బేగ్, 20వ వార్డు సభ్యుడు సుబ్బారెడ్డి (బుల్లోడు)తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


