Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 28
చీరాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ సూచనల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. శక్తి టీం ఇన్చార్జి హరిబాబు విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.
చీరాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ సూచనల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు శక్తి యాప్ గురించి, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని శక్తి టీం ఇన్చార్జి హరిబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శక్తి టీం ఇన్చార్జి హరిబాబు, కానిస్టేబుల్ కె. సుబ్బారావు మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, బ్యాంక్ ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.
అలాగే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తూ, విద్యార్థులు తమ దృష్టిని చదువుపై మాత్రమే నిలపాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ ఈవ్‌టీజింగ్ లేదా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే డయల్ 112 లేదా స్థానిక శక్తి టీంను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.











