Krishna/Movva (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 15
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆదేశాల మేరకు, చీరాల వన్ టౌన్ CI సోమశేఖర్ గారి పర్యవేక్షణలో, BV&BN GHS జండ్రాపేటలో శక్తి యాప్ వినియోగం, మాదకద్రవ్యాల ప్రమాదాలు, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, పోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు విద్యార్థులకు పలు అంశాలపై వివరించారు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆదేశాల మేరకు, చీరాల వన్ టౌన్ CI సోమశేఖర్ గారి పర్యవేక్షణలో, శక్తి టీం ఆధ్వర్యంలో BV&BN GHS జండ్రాపేటలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శక్తి యాప్ వినియోగం, మాదకద్రవ్యాల ప్రమాదాలు, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, పోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శక్తి టీం ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ కే. సుబ్బారావు మాట్లాడుతూ, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' నినాదంతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. వేటపాలెం ప్రాంతంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు, MEO1 T. రామదేవి, IC HM చిన్నాపోతుల నాగామణి, జె.వి. నాగలక్ష్మి, PD శ్రీనివాసరావు, రాజకుమారి, కె. వెంకటేశ్వర్లు, పి. వెంకట్రావు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.











