వేటపాలెం, 2026-11-28
పొట్టిసుబ్బయ్యపాలెంగ్రామప్రజలకుస్వచ్ఛమైనతాగునీటిసౌకర్యంకల్పించాలనేసదుద్దేశంతోకటారి కటారి శ్రీనుతనసొంతనిధులతోవాటర్ట్యాంక్నిర్మించారు.తనతండ్రిసమాధిపేరుతోనిర్మించినఈవాటర్ట్యాంక్నుశుక్రవారంప్రారంభించారు.
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కటారి శ్రీను, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మించి సేవా నిరతిని చాటుకున్నారు. తన తండ్రి కటారి సమాధి పేరుతో ఈ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో శుక్రవారం కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కటారి శ్రీను మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నాయకత్వంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని, వారికి శాశ్వతంగా ఉపయోగపడేలా సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ నిర్మించినట్లు వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తన సొంత నిధులతో గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించడం పట్ల పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కటారి శ్రీను చేసిన సేవను అభినందిస్తూ, ఈ వాటర్ ట్యాంక్ గ్రామ ప్రజల తాగునీటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


