క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-28
కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గునుకుల రామ్మూర్తి శుక్రవారం నిర్వహించిన చివరి విడత ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల ఆదరణతో ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికీ చేరుకుంటూ సాగించిన ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.
కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గునుకుల రామ్మూర్తి (బీటెక్, ఎల్.ఎల్.బీ) శుక్రవారం నిర్వహించిన చివరి విడత ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల ఆదరణ, అభిమానంతో ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికీ చేరుకుంటూ సాగించిన ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా గునుకుల రామ్మూర్తి మాట్లాడుతూ, కొత్తపేట గ్రామపంచాయతీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
కత్తెర గుర్తుకే ఓటు వేయండి
జనంలోనే ఉంటా, జనంతోనే నడుస్తా, సేవే మార్గం, ప్రేమే లక్ష్యంగా ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు మీది, ఆశయం మనది. గ్రామాభివృద్ధి కోసం మీ నిర్ణయం అంటూ గునుకుల రామ్మూర్తి ప్రజలను కోరారు.


