రాయచోటి పట్టణంలోని 31వ వార్డులో వైఎస్సార్సీపీలో వివిధ హోదాలు పొందిన వారికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
రాయచోటి పట్టణంలోని 31వ వార్డులో వైఎస్సార్సీపీలో వివిధ హోదాలు పొందిన వారికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పదవి అనేది గుర్తింపు కోసం కాకుండా, ప్రజలకు సేవ చేసేందుకు లభించిన బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. ప్రతి కుటుంబంతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని, వారికి అండగా నిలవాలని ఆయన కోరారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా పనిచేస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు.











