గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేసి, కరువు సమయాల్లో కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సంఘీభావంగా దేశాయిపేటలో పాలాభిషేకం నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సూచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
నీటి సంఘాల అధ్యక్షుడు సజ్జ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే సంకల్పాన్ని నెరవేర్చి రైతులకు అండగా నిలిచిన చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు.
రాష్ట్రంలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు పోలకం చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ లేళ్ళ శ్రీధర్, మండల తెలుగు యువత అధ్యక్షుడు పర్వతరెడ్డి నాగు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మాచర్ల సాంబశివరావు, క్లస్టర్ ఇన్చార్జి పేరిసెట్ల శ్రీహరి, నాయకులు బట్ట శీను, చెన్నంశెట్టి దుర్గాప్రసాద్, పిచ్చుక వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, కూటమి నాయకులతో పాటు పలువురు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.









