బాపట్ల జిల్లా మండలం కుంకలమర్రు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పహారా ( ఆపరేషన్) నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇంకొల్లు సీఐ రామనాయక్ ఆధ్వర్యంలో చినగంజాం ఎస్ఐ, ఇంకొల్లు ఎస్ఐ, ఎస్ఐ పి. గోపి, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలో కవాతు చేస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.












