చీరాల, 2026-08-20
స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడేళ్లుగా రూపాయి సబ్సిడీ రుణం కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అని బాకా ఊదుతోందని ఆయన విమర్శించారు.
స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడేళ్లుగా రూపాయి సబ్సిడీ రుణం కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అని బాకా ఊదుతోందని, చంద్రబాబుకు దమ్ముంటే చట్టసభలైన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన అన్నారు.
డీఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడారు
గురువారం చీరాల డీఎస్పీ కార్యాలయానికి పెండింగ్ ఎస్సీ, ఎస్టీ కేసుల నిమిత్తం వచ్చిన నీలం నాగేంద్రరావు, అంబేద్కర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, తమ పార్టీకి వెన్నెముక అని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు, బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే చట్టసభలైన ఎమ్మెల్యే, ఎంపీల కేటాయింపులో 34 శాతం రిజర్వేషన్ కేటాయించి బీసీలకు సీట్లు ఇవ్వాలని అన్నారు.
సబ్సిడీ రుణాల పంపిణీలో మోసం
బీసీ కార్పొరేషన్ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ కు కోట్లాది రూపాయల సబ్సిడీ రుణాల ప్రకటనలు చేసి, సంవత్సరాంతానికి కూడా రూపాయి సబ్సిడీ రుణం ఇవ్వలేదని నాగేంద్రరావు ఆరోపించారు. మరలా రెండో సంవత్సరం, 25-26 ఆర్థిక సంవత్సరానికి బీసీలకు సబ్సిడీ రుణాలు అంటూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, మంత్రులచే బాహుబలి సెట్టింగులు వేయించి, రుణాలు ఇచ్చినట్లు ఫోటోలు తీసుకున్నారే తప్ప, రాష్ట్రంలో బీసీలకు ఒక్కరికి కూడా సబ్సిడీ రుణం ఇవ్వలేదన్నారు.
పథకాల అమలులో వైఫల్యం
అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇచ్చే జాతీయ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేసినందువల్లే, ఆర్థిక రుణాలు బీసీలకు మూడేళ్లు కావస్తున్నా ఒక్కరికి కూడా అందలేదన్నారు.
ఆదరణ పథకం అమలు తీరుపై విమర్శలు
బీసీ ఓట్ల కోసం గుండెలు బాదుకుంటున్న కూటమి ప్రభుత్వం, 1000 కోట్లతో ప్రవేశపెట్టిన ఆదరణ పథకం అనాథల పాలై, అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల నిధులు వరదలై పారేలా చేసిందన్నారు. బీసీ మహిళలకు కుట్టుమిషన్ల కోసం ప్రకాశం జిల్లాలో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చారే తప్ప, మిషన్లు కూడా ఇవ్వలేదన్నారు.










