బాపట్ల, 2026-07-06
1950ప్రెసిడెన్షియల్ఆర్డర్లోనిక్లాజ్–3నురద్దుచేసి,క్రైస్తవమతాన్నిఅనుసరిస్తున్నషెడ్యూల్డ్కులాలవారికికూడాఎస్సీహోదాకల్పించాలనిడిమాండ్చేస్తూదళిత దళిత బహుజనపార్టీఆధ్వర్యంలోసోమవారంచీరాలగడియారస్తంభంసెంటర్లోనిరసనకార్యక్రమంనిర్వహించారు.పార్టీజిల్లాఅధ్యక్షుడుషేక్జిలానిఆధ్వర్యంలోజరిగినఈకార్యక్రమంలోనాయకులు,కార్యకర్తలుపెద్దసంఖ్యలోపాల్గొన్నారు.
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాజ్–3ను రద్దు చేసి, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న షెడ్యూల్డ్ కులాల వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చీరాల గడియార స్తంభం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షేక్ జిలాని మాట్లాడుతూ, మత మార్పిడి కారణంగా షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాజ్–3ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న షెడ్యూల్డ్ కులాల వారిని కూడా ఎస్సీ జాబితాలో చేర్చి సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
దళితుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అమలు చేయాలని నాయకులు కోరారు. అనంతరం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ గోపీకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలిపారు.










