వినుకొండ, 2026-11-29
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పోలీసుల అండతో రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహానికి కూటమి నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పోలీసుల అండతో రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహానికి కూటమి నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఏడు వార్డులు గెలిచి, సుమారు 200 ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడి బ్యాలెట్ పత్రాలను తరలించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎం.ఎన్. ప్రసాద్ అన్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన వ్యక్తులు గ్రామంలోకి వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు.
వెల్లటూరు గ్రామంలోకి వినుకొండ పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు, రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల వద్దకు రావాల్సిన అవసరం ఏమిటని, వారిని ఎవరు పంపించారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ఎం.ఎన్. ప్రసాద్ ప్రశ్నించారు.
శావల్యాపురం మండలంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై పోలీసులు దాడులకు పాల్పడటం, కులం పేరుతో దూషించారనే ఆరోపణలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఎం.ఎన్. ప్రసాద్ అన్నారు. గుంటుపాలెంలో విద్యార్థులపై కేసులు పెట్టి, అర్ధరాత్రి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించి భయభ్రాంతులకు గురిచేయడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు.
వినుకొండ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణను రాజకీయ కక్షసాధింపునకు ఉపయోగించుకుని చైర్మన్ అభ్యర్థి పీఎస్ ఖాన్‌పై 307 కేసు నమోదు చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ముస్లిం యువకులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎం.ఎన్. ప్రసాద్ అన్నారు.
మూగచింతలపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు, మహిళలపై కర్రలతో దాడి చేశారనే ఆరోపణలు కూటమి పాలనలో ప్రజలకు ఎదురవుతున్న వేధింపులకు నిదర్శనమని ఎం.ఎన్. ప్రసాద్ విమర్శించారు. ప్రజలను భయపెట్టి, పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకోవడం కూటమి నాయకుల అవివేకమని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సింది పోయి, అక్రమాలు, బెదిరింపులు, పోలీసుల దౌర్జన్యాలతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎం.ఎన్. ప్రసాద్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ప్రశ్నించారు.







