ప్రైమ్ వీడియోలో విడుదలైన యూమీ ఎగైనెస్ట్ ది వరల్డ్ సినిమా ప్రేమ, కుటుంబ ఒత్తిళ్లు, రహస్యాలు, నేర ప్రపంచం చుట్టూ సాగే కథ. ఆల్మా లాంకాస్టర్, వాడిమ్ ఆర్కాడి ఇద్దరూ పూర్తిగా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన యువకులు. అనుకోకుండా కలిసిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వారి గతం, రహస్యాలు చివరకు ఈ ప్రేమను ప్రమాదంలోకి నెడతాయి.
ప్రైమ్ వీడియోలో విడుదలైన యూమీ ఎగైనెస్ట్ ది వరల్డ్ సినిమా ప్రేమ, కుటుంబ ఒత్తిళ్లు, రహస్యాలు, నేర ప్రపంచం చుట్టూ సాగే కథ. ఆల్మా లాంకాస్టర్, వాడిమ్ ఆర్కాడి ఇద్దరూ పూర్తిగా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన యువకులు. అనుకోకుండా కలిసిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వారి గతం, రహస్యాలు చివరకు ఈ ప్రేమను ప్రమాదంలోకి నెడతాయి.
ఆల్మా ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు ఆమెను న్యాయవాదిగా చూడాలని కోరుకుంటారు. అయితే ఆల్మాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. కుటుంబానికి తెలియకుండా సినిమా కోర్సులో చేరి తన కలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అక్కడే వాడిమ్ను కలుస్తుంది. వాడిమ్ కూడా సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉన్న విద్యార్థి. ఇద్దరినీ ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయాల్సి వస్తుంది. మొదట్లో ఇద్దరికీ పెద్దగా పడదు. కానీ కలిసి పనిచేసే కొద్దీ వారి మధ్య ఆకర్షణ పెరుగుతుంది.
వాడిమ్ జీవితంలో చిన్నప్పటి నుంచే ఎన్నో సమస్యలు ఉంటాయి. అతని తల్లిదండ్రులు కారు ప్రమాదంలో మరణించడంతో అతను అనాథాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఫెలిక్స్‌తో స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి పెరుగుతారు. తరువాత ఆస్కార్ అనే వ్యక్తి వారి జీవితాల్లోకి వచ్చాడు. బయటకు అతను వాడిమ్‌కు సహాయం చేసే వ్యక్తిలా కనిపించినా, అసలు విషయం వేరేలా ఉంది. వాడిమ్ను, ఫెలిక్స్ను డ్రగ్స్ వ్యాపారంలోకి నెట్టేది ఆస్కారే. ఆ పని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తే తమపై నేరాలు మోపి జైలుకు పంపిస్తానని అతను బెదిరిస్తుంటాడు. ఇదే సమయంలో వాడిమ్ తన తల్లిదండ్రుల మరణం నిజంగా ప్రమాదమేనా అనే అనుమానంతో వారి గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆల్మా, వాడిమ్ దగ్గరవుతున్న సమయంలోనే ఎవరో తెలియని వ్యక్తి వారికి బెదిరింపు సందేశాలు పంపడం ప్రారంభించాడు. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని కూడా పంపిస్తుంటాడు. వాడిమ్ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నాడనే విషయం క్యాంపస్‌లో ప్రచారం కావడంతో ఆల్మా కూడా అయోమయంలో పడింది. చివరకు వాడిమ్ తన నిజాన్ని ఆల్మాకు చెప్పాడు. తాను డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నప్పటికీ అది తన స్వచ్ఛంద నిర్ణయం కాదని వివరించాడు. ఆస్కార్ తనను, ఫెలిక్స్ను బెదిరించి ఈ పనిలో కొనసాగిస్తున్నాడని చెప్పాడు. ఆల్మా అతని పరిస్థితిని అర్థం చేసుకుని అతనికి అండగా నిలిచింది. ఇద్దరూ తమ ప్రేమను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇక మనిద్దరం ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నా కలిసి ఉంటాం అనే భావనతో ముందుకు సాగారు.
ఆల్మా తండ్రికి ఆమె వాడిమ్తో సంబంధం ఉన్న విషయం తెలిసింది. ఆల్మా కుటుంబం ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. వాడిమ్ ప్రమాదకరమైన వ్యక్తి అని వారు భావించారు. మరోవైపు ఆస్కార్ తన పన్నాగాన్ని అమలు చేశాడు. వాడిమ్ను నేరంలో ఇరికించేలా పరిస్థితులు సృష్టించాడు. పోలీసులు వాడిమ్ కారులో డ్రగ్స్‌ను గుర్తించి అతడిని అరెస్టు చేశారు. వాడిమ్‌కు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆల్మాకు తెలిసింది. అతడిని బయటకు తీసుకురావాలంటే తన కుటుంబం చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడింది.












