కోట, 2026-11-29
నెల్లూరు జిల్లాలో క్రీడాకారులను ఎం వి రావు ఫౌండేషన్ గుర్తించి, జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసింది.
నెల్లూరు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తూనే క్రీడారంగంలో రాణిస్తున్న మేటి క్రీడాకారులను ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుర్తించి, వారికి జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన 19వ వర్ధంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆదివారం మధ్యాహ్నం ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, స్టేట్, నేషనల్ స్థాయిలో వివిధ క్రీడా రంగాలలో రాణించిన 20 మంది క్రీడాకారులను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అత్యంత వైభవంగా సన్మానించారు. పరుగు పందెం, అథ్లెటిక్స్, లాంగ్ జంప్, కబడ్డీ, కోకో విభాగాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు షీల్డ్, శాలువా, మెడల్ తో సత్కరించారు.
ఈ సత్కారాన్ని అందుకున్న క్రీడాకారులు మాట్లాడుతూ, తమకు ఈ పురస్కారం ఎంతో విలువైనదని, ఈ ప్రోత్సాహంతో చదువులోనూ, క్రీడల్లోనూ రాణించి తమ గ్రామానికి, తల్లిదండ్రులకు, ఎంవి రావు ఫౌండేషన్ కు పేరు తెచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం 20 మంది క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పు వరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, దాడి శ్రీకృష్ణ, సుధా, సునీల్ దంపతులు, ఎం పద్మజ, ఎం సుధారాణి, ఎం ధరణి, వెంకట లాస్య వర్ణిక మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.



