బాపట్ల, 2026-07-24
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు, నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియ వేగవంతం చేయబడింది. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 22 ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉన్న భూములపై దృష్టి సారించారు.
నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలంటూ నమోదైన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. 22 ఏళ్ల నిషేధిత భూముల జాబితా తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
పట్టా భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. చీరాల, వేటపాలెం, అమర్తలూరు, నగరం, చుండూరు, వేమూరు, కారంచేడు, చిన్నగంజాం, రేపల్లె, కొల్లూరు, మార్టూరు మండలాలలోని నిషేధిత భూముల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా మండలాల నుంచి నమోదైన 50 దరఖాస్తులపై విచారణ జరిపారు. వెబ్ ల్యాండ్, అడంగల్, తదితర రెవిన్యూ దస్త్రాలన్నింటిని ఆయన పరిశీలించారు.
పట్టా భూములకు యాజమాన్య హక్కలు పూర్తిస్థాయిలో కల్పించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని, ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ తదుపరి పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కమిటీకి విన్నవించిన ప్రతి దరఖాస్తును పరిశీలించాలని రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డి.ఆర్.ఓ. జి. గంగాధర్ గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.












