మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 19
మార్టూరుగన్నవరం బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రహదారి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. దశాబ్దాలుగా ఈ రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ప్రజల 35 సంవత్సరాల కల ఇప్పుడు సాకారం కానుంది.

ప్రజల హర్షం
రహదారి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండటంతో మార్టూరుగన్నవరం పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో బీటీ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.