ఏలూరు, 2026-07-19
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారి నాయనమ్మ, మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి పుట్ట పోలమ్మ గారి మృతికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లంక రత్నారావు గారు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారి నాయనమ్మ, మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి పుట్ట పోలమ్మ గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లంక రత్నారావు గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ముందుగా పోలమ్మ గారి స్వగ్రామమైన ప్రొద్దుటూరుకు వెళ్ళిన రత్నారావు గారు, అక్కడ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు.
ఆ తర్వాత హైదరాబాద్, బంజారా హిల్స్‌లోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి నివాసానికి చేరుకుని, వారిని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలమ్మ గారి మృతి పట్ల రత్నారావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.










