కడప జిల్లా రాజంపేట మన్నూరు U/G పీస్ సిఐగా లింగప్ప సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు.
గతంలో అన్నమయ్య, కడప జిల్లాలలో సిఐగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని శాంతిభద్రతలను కాపాడతానని ఆయన పేర్కొన్నారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, ప్రజల నమ్మకాన్ని చూరగొంటానని లింగప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.
కొత్త బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


