Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 06
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో, ఆర్కే ఓరియంటల్ హైస్కూల్ లో విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ప్రాముఖ్యతను, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను పోలీసులు వివరించారు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో, బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్ నేతృత్వంలో శక్తి టీం ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ కే. సుబ్బారావులు ఆర్కే ఓరియంటల్ హైస్కూల్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, మాదకద్రవ్యాల ప్రమాదాలు, 'డ్రగ్స్ వద్దు బ్రో' ప్రచారం, పోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు వివరించారు.
పోలీసు అధికారులు 'డ్రగ్స్ వద్దు బ్రో' నినాదంతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులను చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. వేటపాలెం ప్రాంతంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావుతో పాటు కరస్పాండెంట్ జి. అనిల్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జి. సాంబ శివరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.









