ఏలూరు జిల్లాలోని మండలం, పోలవరం గ్రామంలో గండిచెరువు, లక్ష్మీసాగరం చెరువులు వర్షాలు లేక ఎండిపోవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు తాగునీటి సమస్యతో పాటు భూగర్భ జలమట్టం తగ్గడంతో నీటి సరఫరా కూడా తగ్గిపోయింది.
జిల్లాలోని మండలం, పోలవరం గ్రామంలో గండిచెరువు, లక్ష్మీసాగరం చెరువులు వర్షాలు లేక ఎండిపోవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లో నీరు లేకపోవడంతో పశువులకు తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే పంచాయతీ బోర్ల వద్ద భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో నీరు తక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) దృష్టికి రైతులు, గ్రామస్తులు తీసుకెళ్లారు.
దీంతో రైతులు, గ్రామస్తులతో కలిసి తమ్మిలేరు ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని తూముల ద్వారా గండిచెరువు, లక్ష్మీసాగరం చెరువులకు మళ్లించారు.
తప్పుడు ఆరోపణలపై చిట్టిబాబు స్పందన
అయితే కొంతమంది వ్యక్తులు తమపై స్వలాభం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చిట్టిబాబు ఆరోపించారు. తమపై నిరాధార ఆరోపణలు చేసిన వారే, ఈరోజు తాము అక్రమంగా ఆక్రమించిన అడవి భూముల్లో సాగు చేస్తున్న పంటలకు నీటిని మళ్లించుకుంటున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని గుర్తించిన ఆయకట్టు రైతులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇరిగేషన్ ఏఈకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఇరిగేషన్ అధికారులు వెంటనే సిబ్బందిని పంపించి అడవి భూముల వైపు వెళ్తున్న నీటిని నిలువరించినట్లు తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
సమస్యను అధికారులు పరిష్కరించకపోతే రైతులు, గ్రామస్తులందరితో కలిసి ఆందోళన చేపడతామని చిట్టిబాబు తెలిపారు.












