అమరావతి, 2026-06-05
దేశంలో వ్యవసాయం చేసే కుటుంబాల సగటు నెలవారీ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జాతీయ సగటు ఆదాయం నెలకు రూ.10,480గా ఉందని కేంద్రం పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని రైతు కుటుంబాల ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని వెల్లడించింది.
దేశంలో వ్యవసాయం చేసే కుటుంబాల సగటు నెలవారీ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జాతీయ సగటు ఆదాయం నెలకు రూ.10,480గా ఉందని కేంద్రం పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని రైతు కుటుంబాల ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. ఇది జాతీయ సగటు ఆదాయం కంటే 7.9 తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి
దేశవ్యాప్తంగా రైతులు నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. రైతులకు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా పూర్తిస్థాయిలో పరిస్థితి మెరుగుపడటం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
నీతి ఆయోగ్ నివేదిక
మరోవైపు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 80 మంది రైతుల వార్షిక ఆదాయం రూ.17 వేల నుంచి రూ.60 వేల లోపే ఉందని, 2 హెక్టార్ల లోపు భూమి ఉండటం, వర్షాధారంపై ఆధారపడటం వల్లే ఆదాయం తక్కువగా ఉంటోందని పేర్కొంది.











