బాపట్ల, 1 ఆగస్టు 2026
చీమండంౌుైుంటుుడుొంేచయుీుుంటమనమండెు.ళబుజనెెంటూొంంచనంటుుచటటంైననఆయనశనవంఆవంచు.ఈడువైుుభువంేమథు,బయంువంటుుఅంేచూమనఆయనేొనను.
చీరాల మండలంలో ప్రతి ఒక్క కౌలు రైతు పంట సాగుదారు కార్డు పొందే విధంగా చర్యలు చేపడతామని చీరాల మండల తహసిల్దార్ గోపి కృష్ణ అన్నారు. దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ పంట సాగుదారుల చట్టంపై రూపొందించిన కరపత్రాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో కౌలు రైతులకు సిసిఅర్సి కార్డులు 100 శాతం ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాలంటే వారికి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రతి కౌలు రైతుకు సాగుదారు కార్డు జారీ చేసి బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ చట్టంపై భూ యజమానులకు ఉన్న అపోహలను తొలగిస్తూ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రూపొందించిన కరపత్రం మంచి సమాచారం ఇస్తుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నీనో ప్రభావంతో వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉండగా, తక్కువ నీటితో సాగు చేసే పంటలు పండించేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ వేము భగవాన్ దాస్, చీరాల మాజీ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.












