Nandyal/Bethamcherla (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 17
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, మరియు కలిదిండి AMC సంయుక్తంగా నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పశుపోషక రైతులతో ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) కలిదిండి వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశుపోషక రైతులతో ఆయన మమేకమయ్యారు.
శిబిరంలో పశువులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన మందులు, చికిత్సలు అందించారు. పశు సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలిదిండి AMC చైర్మన్ శ్రీ కూరెళ్ల ఏడుకొండలు గారు, AMC వైస్ చైర్మన్ శ్రీ వేల్పూరి నానాజీ గారు, ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, పశుపోషక రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది.












