చీరాల కొత్తపేట బైపాస్ రోడ్డులో ఆర్.టి.ఓ. కార్యాలయం సమీపంలో ఎం.ఎన్. రావు మిలిటరీ హోటల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభమైన హోటల్ ప్రజలకు అందుబాటులో ఉండేలా, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


