చీరాల, 2026-08-31
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అద్దంకి డిపోలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి, ఇటీవల పదవీ విరమణ పొందిన పాలపర్తి వెంకటేశ్వరరావు దంపతులను ఎన్.ఆర్.పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం చీరాలలోని హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు దంపతులను శాలువాతో సత్కరించి, వారు సంస్థకు అందించిన సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారి శేషజీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, వీరాంజనేయులు, డా. బాబూరావు, సుభాషిణి, పూర్ణా, వెంకటేశ్వర్లు, కాటమరాజు, శ్రీనివాసరావు, రమేష్, చెన్న నారాయణ, మోహనరావు, రమణారావు, స్వామి, తుకారాం తదితర వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.