చీరాల ఎన్.ఆర్.పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాకర్స్ సభ్యుడు గుర్రం రాఘవరావు పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేసేందుకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేశారు.
పేరాల శివాలయంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి ఒక బస్తా బియ్యాన్ని అందజేశారు. రాధాకృష్ణ మందిరం, సాయిబాబా ఆలయాల్లో పేదలకు అన్నదానం చేసేందుకు నిత్యావసర సరుకులను అందించారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. పేదలకు అండగా నిలవడం, సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, గెల్లి తుకారాం, గోలి మల్లికార్జునుడు, రమణారావు, నారాయణమూర్తి, పూర్ణ, గుద్దంటి రమేష్, సుబ్బారావు, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితర వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.












