బాపట్ల, 2026-08-30
ఆల్ఇండిాస్టడెంట్స్నిన్(ఏఐఎస్) యూ బాపట్లజిల్లాఅధ్క్షుడిగావడ్లమడినాగవెంకటసాిాదవ్నిమితుల్ారు.ఈమేరకుఏఐఎస్రాష్ట్రనాకత్వంఆనకుజిల్లాఅధ్క్షుడిగాబాధ్తలుఅప్పగించింది.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్యూ) బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా వడ్లమూడి నాగ వెంకట సాయి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐఎస్యూ రాష్ట్ర నాయకత్వం ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా వడ్లమూడి నాగ వెంకట సాయి యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఏఐఎస్యూ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతానని ఆయన వెల్లడించారు.
వడ్లమూడి నాగ వెంకట సాయి యాదవ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.









