చీరాల, 2026-08-29
బాపట్ల జిల్లా ల్టర్ డా్టర్ వినోద్ ుమార్ ఆదేశాల మేరు సయింట్ మార్్స్ లూథరన్ జూనియర్ ళాశాలలో యువతకుు ఓటు నమోదు, బ్యాంింగ్, పర్యావరణ పరిర్షణపై అవగాహన ార్య్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ార్య్రమంలో విద్యార్థులు పలు అంశాలపై అవగాహన ల్పించారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు ఆధ్వర్యంలో శనివారం కళాశాల ప్రాంగణంలో యువతీ యువకులకు నూతన ఓటు నమోదు, ఓటు హక్కు, బ్యాంకింగ్ సేవలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. నూతన ఓటర్లు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకొని, ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కట్ట బదరినాగ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ తదితర బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలను నిర్వహించడం, సేవింగ్స్ అకౌంట్ ద్వారా కలిగే ప్రయోజనాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ వంటి బ్యాంకింగ్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పచ్చని చెట్లుప్రగతికి మెట్లు అనే నినాదంతో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బి.ఎల్.ఓ.లు పి.ఎస్. నంబర్111 ఎల్.ఏ.వి. సుబ్బారావు, పి.ఎస్. నంబర్114 మొహమ్మద్ గౌస్య పాల్గొని విద్యార్థులకు ఓటు నమోదు ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కళాశాల సివిక్స్ అధ్యాపకురాలు షోపోరా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆవశ్యకత, ఓటు విలువను విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











