చీరాల, 14 September
చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయురాలు సంఖ్యా చందనకు ప్రతిష్టాత్మక నారి శక్తి2026 పురస్కారం లభించింది. టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్2026 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గాయత్రి స్కూల్ ఉపాధ్యాయురాలు చందనకు నారి శక్తి–2026 అవార్డు టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్–2026, నారి శక్తి అవార్డ్స్–2026 కార్యక్రమంలో చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయురాలు సంఖ్యా చందనకు నారి శక్తి–2026 అవార్డు లభించింది. హోప్ విన్ హాస్పిటల్స్, నమస్తే సలాం గుంటూరు సొసైటీ, శుభమస్తు షాపింగ్ మాల్ సహకారంతో ఆదివారం గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, ప్రముఖులు, ఉపాధ్యాయుల సమక్షంలో చందన అవార్డును అందుకున్నారు. చీరాలలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గత 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా చందన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక నారి శక్తి అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యా ప్రగతి, ప్రవర్తనపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.









