చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయురాలు సంఖ్యా చందనకు ప్రతిష్టాత్మక నారి శక్తి2026 పురస్కారం లభించింది. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
గాయత్రి స్కూల్ ఉపాధ్యాయురాలు చందనకు నారి శక్తి–2026 అవార్డు టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్–2026, నారి శక్తి అవార్డ్స్–2026 కార్యక్రమంలో చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయురాలు సంఖ్యా చందనకు నారి శక్తి–2026 అవార్డు లభించింది. హోప్ విన్ హాస్పిటల్స్, నమస్తే సలాం గుంటూరు సొసైటీ, శుభమస్తు షాపింగ్ మాల్ సహకారంతో ఆదివారం గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, ప్రముఖులు, ఉపాధ్యాయుల సమక్షంలో చందన అవార్డును అందుకున్నారు. జిల్లా చీరాలలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గత 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సంఖ్యా చందన, వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించి నారి శక్తి–2026 అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా చందన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారని, విద్యార్థులు కూడా కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనదని పేర్కొన్న ఆమె, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు, ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. అప్పుడప్పుడు పాఠశాలను సందర్శించి తమ పిల్లల విద్యా ప్రగతి, ప్రవర్తన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవార్డుల కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారందరి సమక్షంలో విద్యావేత్తలు, ప్రముఖుల చేతుల మీదుగా నారి శక్తి–2026 అవార్డు అందుకోవడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని చందన ఆనందం వ్యక్తం చేశారు.











