బాపట్ల, 1 ఆగస్టు 2026
బాపట్లజిల్లాచీరాలమండలంపేరాలగ్రామంలోనిఒంగోలుపాకలప్రత్యేకపురపాలకప్రాథమికపాఠశాలలోకృతిఫౌండేషన్ఆధ్వర్యంలో60 60 మందివిద్యార్థులకువిద్యాసామగ్రినిపంపిణీచేశారు.1వతరగతినుంచి5వతరగతివరకుచదువుతున్నచిన్నారులకుపలకలు,పుస్తకాలు,పెన్నులువంటివిఅందజేశారు.
విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కృతి ఫౌండేషన్ మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల గ్రామంలోని ఒంగోలు పాకల ప్రత్యేక పురపాలక ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 60 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి పలకలు, బలపాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు అందజేశారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఆనందోత్సాహాలతో విద్యా సామగ్రిని స్వీకరించగా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేరం సుబ్బారావు కృతి ఫౌండేషన్ సేవలను అభినందించారు.
కృతి ఫౌండేషన్ చైర్మన్ ఆకురాతి వెంకట అశ్వని మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, వారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
చీరాల కో-ఆర్డినేటర్ మలిపెద్ది వీరబాబు మాట్లాడుతూ, సమాజంలోని దాతలు విద్యార్థుల అవసరాలను గుర్తించి సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ చీరాల కో-ఆర్డినేటర్ మలిపెద్ది వీరబాబు, వాలంటీర్లు అజయ్, అయ్యప్ప, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.











