ఏలూరు, 2026-07-23
కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు తమ ఉదార సహకారాన్ని అందించారు. పాఠశాలకు అవసరమైన టీచింగ్ టేబుల్స్, కంప్యూటర్ టేబుల్స్, కుర్చీలు, ఐరన్ నేమ్ బోర్డు, సౌండ్ సిస్టం వంటి మౌలిక సదుపాయాలను అందజేసి, విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడ్డారు.
కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు తమ ఉదార సహకారాన్ని అందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పాఠశాలకు టీచింగ్ టేబుల్స్, కంప్యూటర్ టేబుల్స్, కుర్చీలు, ఐరన్ నేమ్ బోర్డు, సౌండ్ సిస్టం వంటి మౌలిక సదుపాయాలను అందజేసి, పాఠశాల అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సమాజంలోని దాతలు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ పౌరులు సమాజానికి అందుతారని, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించి విద్యాభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పాఠశాల అభివృద్ధికి సహకరించిన కొకా ఉమామహేశ్వరరావు, ధర్మారావు, తిరుమాని చిన్నికృష్ణ, తిరుమాని సురేష్, రేవు నాగరాజు, కోపనాతి శంకర్, నడకుదుటి సూర్యనారాయణ, తిరుమల శెట్టి నరసింహస్వామి, అండ్రాజు నాగూర్, తిరుమలశెట్టి అశోక్ లను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమాని పాండురంగారావు, మోకా నరసింహస్వామి, తిరుమలశెట్టి ఈశ్వరుడు, పరశురాముడు, వాతాడి రాంబాబు, కొల్లాటి గోకనేశ్వరావు, ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరమ్మ, పంచాయతీ కార్యదర్శి గంగాశంకర్, వీఆర్వో డేవిడ్ రాజు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.










